లోక్‌భవన్‌లో ఘనంగా ఎట్ హోమ్
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:47 AM
గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం విజయవాడలోని లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం ఘనంగా జరిగింది.
అతిథుల వద్దకు వెళ్లి పలుకరించిన గవర్నర్
లోకేశ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన అబ్దుల్ నజీర్
అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం విజయవాడలోని లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, ఆయన భార్య గుడియా ఠాకూర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజనెవా, విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ తదితరులు హాజరయ్యారు. సాయంత్రం 4.32 గంటలకు లోక్‌భవన్‌కు చేరుకున్న చంద్రబాబు, జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, పవన్ కల్యాణ్.. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి.. ఎట్ హోం వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం జాతీయగీతాలపన జరిగింది. గవర్నర్ అతిథుల వద్దకు స్వయంగా వెళ్లి పేరుపేరునా ఆప్యాయంగా పలుకరించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన, సీఎం, సీజే, డిప్యూటీ సీఎం కాసేపు చర్చించుకున్నారు. సీఎంతో చర్చ మధ్యలో లోకేశ్‌ను కూడా గవర్నర్ పిలిచి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. గంట తర్వాత జాతీయ గీతాలాపనతో ఎట్ హోమ్ ముగిసింది. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖాన్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రులు పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, కొల్ల రవీంద్ర, ఎస్.సవిత, రాంప్రసాద్‌రెడ్డి, కె.శ్రీనివాస్. హైకోర్టు న్యాయమూర్తులు, పద్మ అవార్డు గ్రహీతలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, జీఏడీ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) శ్యామలరావు, అధికారులు పాల్గొన్నారు.