రాష్ట ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: గవర్నర్
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:08 AM
పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, ఐశ్వర్యం, సామరస్యం, ఆనందాన్ని తెస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, ఐశ్వర్యం, సామరస్యం, ఆనందాన్ని తెస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగు వారందరికి ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. కాగా, ఉగాది పండగ రోజు గ్రామ దేవతలకు సారె సమర్పించాలని రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.