Share News

రిపబ్లిక్‌ డే.. స్వేచ్ఛా పోరాటానికి స్ఫూర్తి

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:31 AM

స్వతంత్య్ర స్వేచ్ఛాఫలాలను ఆస్వాదించడానికి దోహదపడిన స్వాతం త్య్ర సమరయోధులను స్మరించుకునే రోజు గణతంత్ర దినోత్సవమని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

రిపబ్లిక్‌ డే.. స్వేచ్ఛా పోరాటానికి స్ఫూర్తి

  • గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌

అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): స్వతంత్య్ర స్వేచ్ఛాఫలాలను ఆస్వాదించడానికి దోహదపడిన స్వాతం త్య్ర సమరయోధులను స్మరించుకునే రోజు గణతంత్ర దినోత్సవమని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. జాతీయ స్వేచ్ఛా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి వంటి గొప్ప ఆదర్శాలకు పునంకితమయ్యే రోజు ఇదని చెప్పారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభదినాన మన దేశ మూల స్తంభాలైన... న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని సమర్థించడం ద్వారా దేశ నిర్మాణ లక్ష్యానికి మనమంతా కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేద్దామని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

పద్మ అవార్డులు పొందినవారికి గవర్నర్‌ అభినందనలు

పద్మ అవార్డులు పొందిన రాష్ట్రానికి చెందిన ప్రముఖులకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు లోక్‌భవన్‌ ఆదివారం ఒక ప్రకటన జారీచేసింది. కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ ఇండో-అమెరికన్‌ వైద్యుడు డా.నోరి దత్తాత్రేయుడు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. అలానే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన రాజేంద్రప్రసాద్‌, మురళీ మోహన్‌, వెంపటి కుటుంబ శాస్త్రిలకు, మరణానంతరం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ కుటుంబసభ్యులకు కూడా గవర్నర్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 26 , 2026 | 03:33 AM