Share News

2న పోలవరానికి గవర్నర్‌ నజీర్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:07 AM

ఏప్రిల్‌ 2న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అధికారికంగా ఇంకా గవర్నర్‌ పర్యటనను ధ్రువీకరించలేదు.

2న పోలవరానికి గవర్నర్‌ నజీర్‌

అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్‌ 2న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అధికారికంగా ఇంకా గవర్నర్‌ పర్యటనను ధ్రువీకరించలేదు. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలంటూ జల వనరుల శాఖకు మౌఖిక ఆదేశాలు చేరాయి.

పీపీఏ సీఈవోగా సంజీవ్‌ వోహ్రా

పోలవరం ప్రాజెక్టు సీఈవోగా యోగేశ్‌ పైథాంగర్‌ స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సంజీవ్‌ వోహ్రా నియమితులయ్యారని జల వనరుల శాఖ వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు అఽథారిటీ సీఈవోగా ప్రస్తుతం ఫైథాంగర్‌ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Updated Date - Mar 20 , 2026 | 05:07 AM