Share News

ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథతో మేలు

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:22 AM

ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథ(ఏఐ) రోబోటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాలను అనుసంధానిస్తుందని...

ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథతో మేలు

  • వైద్య వృత్తిని కెరీర్‌గా కాకుండా సేవగా చూడాలి

  • కాటూరి వైద్య కళాశాలగ్రాడ్యుయేషన్‌ డేలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

గుంటూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథ(ఏఐ) రోబోటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాలను అనుసంధానిస్తుందని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. రోగితో పరస్పరం సంభాషించడం, ప్రిడిక్టివ్‌ ఎనలిటిక్స్‌, రిమోట్‌ పర్యవేక్షణలో సాంకేతికతలు ఎలా వినియోగంలో ఉన్నాయో పరిశోధించవచ్చన్నారు. సాంకేతికతను అవసరం మేరకు ఉపయోగించుకోవాలే త ప్పదానిని జవాబుదారీతనం, నైతిక నిర్ణయం తీసుకోవడంలో ఎప్పుడూ అనుమతించవద్దని సూ చించారు. బుధవారం గుంటూరు జిల్లా చినకోండ్రుపాడులోని కాటూరి వైద్య కళాశాల, హాస్పిటల్‌లో జరిగిన 22వ గ్రాడ్యుయేషన్‌ డేలో గవర్నర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. నీతి, కరుణ, సానుభూతి వైద్యవృత్తికి మూడు ప్రధాన స్తంభాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడలోని స కురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ సం కురాత్రి, కాటూరి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ గుంటూరుచైర్మన్‌ కాటూరి సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 05:23 AM