బాబూ జగ్జీవన్‌తోనే హరిత విప్లవం: గవర్నర్
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:20 AM
బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని, సమాజంలోని అణగారిన వర్గాల హక్కు కోసం పోరాడారని గవర్నర్ అబ్దుల్ నజీర్ గుర్తుచేశారు.
అమరావతి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని, సమాజంలోని అణగారిన వర్గాల హక్కు కోసం పోరాడారని గవర్నర్ అబ్దుల్ నజీర్ గుర్తుచేశారు. ఆదివారం లోక్‌భవన్‌లో జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి, ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ హరిత విప్లవానికి నాంది పలికారని చెప్పారు.