Share News

శ్రీవారి సేవలో గవర్నర్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:26 AM

తిరుమల శ్రీవారిని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మంగళవారం దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయం మహద్వారం వద్దకు...

శ్రీవారి సేవలో గవర్నర్‌

తిరుమల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మంగళవారం దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చక బృందం ఇస్తికాఫల్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన అబ్దుల్‌ నజీర్‌ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆయన్ను ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్లు ఈవో, అదనపు ఈవో అందజేశారు.

Updated Date - Apr 01 , 2026 | 05:27 AM