సుప్రీం కోర్టు సీజేకు గవర్నర్ తేనీటి విందు
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:32 AM
రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీం జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం ఆయనకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు.
సీఎం, హైకోర్టు సీజే, డిప్యూటీ సీఎం, సుప్రీం న్యాయమూర్తుల హాజరు
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీం జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం ఆయనకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. ఆదివారం జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం గవర్నర్ ఆహ్వానం మేరకు విజయవాడలోని లోక్‌భవన్‌కు వెళ్లిన సీజేకు గవర్నర్ ప్రత్యేకంగా పుష్ఫగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. తేనీటి విందులో గవర్నర్‌తో పాటు సీఎం చంద్రబాబు, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులున్నారు. అలాగే, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ పమిడిఘంటం నరసింహ, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టి, జస్టిస్ జోయ్ మాల్యాబాగ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.