చంద్రబాబుకు గవర్నర్ అభినందనలు
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:09 AM
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025 అవార్డును అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అభినందనలు తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025 అవార్డును అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అభినందనలు తెలిపారు. శనివారం ముంబైలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ అవార్డు ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ సంస్థ.. సీఎంకు ఈ అవార్డు ప్రకటించిన సందర్భంగా శనివారం లోక్‌భవన్ నుంచి ఒక ప్రకటన జారీ చేశారు. ‘వేగవంతమైన పరిపాలనపై సీఎం చంద్రబాబు దృష్టిసారించడంతో పాటు భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలను అమలు చేయడంలో ఆయన ముందున్నారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఐటీ, హరిత ఇంధనంపై దృష్టి పెట్టడంతోపాటు.. విధాన సంస్కరణలు, ఆర్థికాభివృద్ధిలో సీఎం చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. ఇది ప్రజలకు, రాష్ట్రానికి గర్వకారణం’ అని గవర్నర్ కొనియాడారు.