Share News

త్రికోటేశ్వర స్వామికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 06:01 AM

పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఫిబ్రవరి...

త్రికోటేశ్వర స్వామికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు

  • శివరాత్రి రోజున సమర్పించనున్న దేవదాయ మంత్రి ఆనం

అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఫిబ్రవరి 12 నుంచి 15 వరకూ ఘనంగా నిర్వహించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. శివరాత్రిరోజున స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ హరిజవహర్‌ లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jan 24 , 2026 | 06:02 AM