లైంగిక వేధింపుల బాలలకు అండగా..
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:29 AM
లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయపరమైన, మానసిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని...
సపోర్ట్ పర్సన్స్‌ను నియమించనున్న ప్రభుత్వం
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయపరమైన, మానసిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. పోక్సో చట్టం-2012, సెక్షన్ 39 ప్రకారం బాధితులకు కేసు విచారణకు ముందు, విచారణ సమయంలో మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సపోర్ట్ పర్సన్స్‌ను నియమించనున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల మేరకు ఈ నియామకాలు జరుగుతాయన్నారు. జిల్లాకు ఒకరు చొప్పున 28 మంది సపోర్ట్ పర్సన్స్‌ను నియమిస్తారన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు, కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు, విధులు, ఇతర నిబంధనలతో కూడిన ప్రత్యేక నోటిఫికేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు త్వరలోనే విడుదల చేస్తారన్నారు. బాధితులైన బాలలకు భరోసా కల్పించి, వారి హక్కులను కాపాడటమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.