సీసీఐ స్కాంలో అధికారులపై చర్యలు నిలుపుదల
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:22 AM
రాష్ట్రంలో 2016లో మద్దతు ధరకు సీసీఐ పత్తి కొనుగోలు చేసిన అంశంలో కుంభకోణాలకు పాల్పడ్డారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న..
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2016లో మద్దతు ధరకు సీసీఐ పత్తి కొనుగోలు చేసిన అంశంలో కుంభకోణాలకు పాల్పడ్డారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు మార్కెటింగ్‌శాఖ అధికారులకు ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఈ వ్యవహారంలో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ పూర్తై, క్రమశిక్షణ చర్యలు ముగియడంతో ఇద్దరు జేడీఎంలు, ఒక డీడీఎం, ఇద్దరు ఏడీఎంలపై తదుపరి చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసింది.