Share News

అంగన్‌వాడీలకు ప్రభుత్వం అండ

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:04 AM

ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీలకు అండగా నిలుస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ స్పష్టం చేశారు.

 అంగన్‌వాడీలకు ప్రభుత్వం అండ
గుడిసె కృష్ణమ్మకు వినతి పత్రం అందజేస్తున్న అంగన్‌వాడీలు

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

ఆదోని, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీలకు అండగా నిలుస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలో గుడిసె కృష్ణమ్మను ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ నాయకులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ అంగన్‌వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచామని, ప్రతినెలా 1నే జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, టీవీ, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుతో పాటు 58వేల మంది అంగనవాడీలకు 5జీ స్మార్ట్‌ ఫోన్‌లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గ్రాట్యుటీ సౌకర్యం కల్పించడంతో పాటు మినీ అంగన్‌వాడీలను పూర్తి స్థాయి కేంద్రాలుగా మా ర్చుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ, అంగన్‌వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అంగన్‌వాడీ ప్రతినిధులు జానకి, గౌసి యా, వీరేష్‌, గీతాదేవి, ప్రభావతి, శంకరమ్మ, దేవలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:04 AM