Share News

నీట్‌, జేఈఈ ర్యాంకులే లక్ష్యం

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:07 AM

జేఈఈ, నీట్‌ ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని మంత్రి లోకేశ్‌ అన్నారు...

నీట్‌, జేఈఈ ర్యాంకులే లక్ష్యం

  • ప్రభుత్వ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

  • వయోజన విద్యలో 25 లక్షల మంది ఉత్తీర్ణత: మంత్రి లోకేశ్‌

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): జేఈఈ, నీట్‌ ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని మంత్రి లోకేశ్‌ అన్నారు. ప్రతి ప్రాంతంలో 4 రెసిడెన్షియల్‌ కాలేజీలు, 4 కేజీబీవీల్లో కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యాశాఖపై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్‌లో డ్రాపౌట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు 19లోగా పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి త్రీస్టార్‌ రేటింగ్‌కు తీసుకురావాలని మంత్రి అన్నారు. మన బడి-మన భవిష్యత్తు కోసం రూ.2,034 కోట్ల నిధులు సమీకరించాలని ఆదేశించారు. టీచర్లంతా అభ్యసన ఫలితాల మెరుగుదల, అడ్మిషన్లపైనే దృష్టి పెట్టాలన్నారు. మధ్యా హ్న భోజనంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. వయోజన విద్యలో గణనీయమైన పురోగతి సాధించడంపై సంతృప్తి వ్యక్తంచేశారు.

Updated Date - Apr 02 , 2026 | 04:07 AM