ప్రభుత్వ పాఠశాలలతో లాభాలెన్నో..!
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:02 AM
ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలను చేర్చితే.. తల్లిదండ్రులకు సుఖం, విద్యార్థులకు ప్రయోజనం అంటూ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని మక్కపేటకు జిల్లా పరిషత్..
మక్కపేట మాస్టారు వినూత్న ప్రచారం
వత్సవాయి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలను చేర్చితే.. తల్లిదండ్రులకు సుఖం, విద్యార్థులకు ప్రయోజనం అంటూ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని మక్కపేటకు జిల్లా పరిషత్ పాఠశా ల ఉపాధ్యాయుడు, ఆ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన అజ్మీర్ శ్రీనివాసరావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచేందుకు ఆయన తన ద్విచక్ర వాహనానికి మైకు ఏర్పాటు చేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే తల్లికి వందనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు బుక్స్, యూనిఫాంతోపాటు .. మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం వంటి సదుపాయాలు అందుతాయని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.