ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:59 PM
రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న అన్ని సంక్షే మ పథకాలు ప్రజల కు అందేలా అధికా రులు పని చేయాల ని జిల్లా స్వర్ణ గ్రా మ, స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ నాయుడు అన్నారు.
తుగ్గలి, జూన 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న అన్ని సంక్షే మ పథకాలు ప్రజల కు అందేలా అధికా రులు పని చేయాల ని జిల్లా స్వర్ణ గ్రా మ, స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ నాయుడు అన్నారు. సోమవారం జొన్నగిరి సచివా లయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోని పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ప్రతి సచివాలయ పరిధిలోని యూనిఫైడ్ ప్యామిలీ సర్వే సంబంధించి అన్ని ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం అధికారులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నారాయణ స్వామి, పద్మా వతి, మారుతి ప్రసాద్, తదితరులున్నారు.