విపత్తు బాధిత రైతులకు అండగా ఉంటాం: అచ్చెన్న
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:09 AM
ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ... ‘బుడమేరు వరదలకు నష్టపోయిన రైతులకు రూ.370 కోట్లు పరిహారం అందించాం. ఇటీవలి తుఫాన్లకు నష్టపోయిన రైతులకు రూ.369 కోట్లు చెల్లించాం. మొంథా తుఫాను నష్టాలపై సర్వే పూర్తయింది. కేంద్రం నుంచి నిధులు రాగానే రైతులకు పరిహారం అందిస్తాం’ అని తెలిపారు.