చేనేత రంగానికి అధిక ప్రాధాన్యం: మంత్రి సవిత
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:40 AM
రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. అసెంబ్లీలో మండపేట ఎమ్మెల్యే...
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. అసెంబ్లీలో మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో నుంచి రూ.7 కోట్ల మేర బకాయిలు చెల్లించామన్నారు. రాబోయే ఉగాది పండుగకు కూడా మరో విడత బకాయిలు చెల్లిస్తామన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఏప్రిల్ 1 నుంచి అందజేస్తామని తెలిపారు. పావలా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని, 10 చిన్న క్లస్టర్లు మంజూరు చేశామన్నారు.