Share News

కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలివ్వండి

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:22 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో రెగ్యులరైజేషన్‌కాని కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ కోరింది.

కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలివ్వండి

  • అన్ని శాఖలకూ ఆర్థిక శాఖ నోట్‌

అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో రెగ్యులరైజేషన్‌కాని కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ కోరింది. ఈ మేరకు ఆయా శాఖాధిపతులకు నోట్‌ జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ కోసం తీసుకువచ్చిన జీవో 30/2023ను అనుసరించి ఇంకా రెగ్యులర్‌ కాకుండా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను పంపాలని సూచించింది. ఈ క్రమంలో 7 అంశాలను ప్రధానంగా పేర్కొంది. ఆయా అంశాల ఆధారంగా వివరాలు పంపాలని తెలిపింది.

Updated Date - Feb 04 , 2026 | 04:22 AM