Minister Satya kumar: ప్రభుత్వ ఆసుపత్రులకు కార్పొరేట్ ‘గుర్తింపు’
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:50 AM
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
1,454 వైద్యశాలలకు ‘ఎన్‌క్వాస్’ సర్టిఫికెట్
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. దీనికి నిదర్శనంగా కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌క్వా్‌స(జాతీయ నాణ్యత ప్రమాణాల హామీ) నుంచి ప్రాథమిక, సెకండరీ వైద్య సేవలందించే 1,454 ఆసుపత్రులకు సర్టిఫికెట్లు లభించాయన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు లభించే ఈ గుర్తింపు ప్రభుత్వ ఆసుపత్రులకు లభించడం హర్ష్షణీయమని తెలిపారు.