Share News

ఆపరేషన్‌ డ్రోనగిరి పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:29 AM

సర్వే ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఓఐ) సూచనల మేరకు రాష్ట్రంలో ఆపరేషన్‌ డ్రోనగిరి పర్యవేక్షణకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆపరేషన్‌ డ్రోనగిరి పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): సర్వే ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఓఐ) సూచనల మేరకు రాష్ట్రంలో ఆపరేషన్‌ డ్రోనగిరి పర్యవేక్షణకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీకి సీసీఎల్‌ఏ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో స్టేట్‌ జియోస్పేషియల్‌ డైరెక్టర్‌ సభ్యకార్యదర్శిగా ఉంటారని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఆపరేషన్‌ డ్రోనగిరిలో ఏపీలో విజయనగరం జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు.

Updated Date - Mar 11 , 2026 | 05:31 AM