Chief Secretary Vijay Anand: ఇంధన సామర్థ్య కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలి
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:46 AM
ఇంధన సామర్థ్య కార్యక్రమాలను, ఇంధన సంరక్షణ చర్యలను అన్ని ప్రభుత్వ సంస్థలు, విభాగాలు అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణించి...
ప్రభుత్వ విభాగాలకు సీఎస్ సూచన
అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఇంధన సామర్థ్య కార్యక్రమాలను, ఇంధన సంరక్షణ చర్యలను అన్ని ప్రభుత్వ సంస్థలు, విభాగాలు అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణించి అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చైర్మన్ విజయానంద్ సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి వర్చువల్‌గా నిర్వహించిన ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ 15వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి సీఎస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... ‘ఇంధన సామర్థ్య చర్యల వల్ల విద్యుత్తు డిమాండ్ తగ్గడంతోపాటు ప్రభుత్వ వ్యయాలూ తగ్గుతాయి ఇంధన సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఎనర్జీ క్లబ్‌ల విస్తరణకు ఏపీఎ్‌సఈసీఎం చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల్లో ఇంధన మార్పిడి, హీట్ ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాలను స్వాగతించాలి. ఇవి పరిశ్రమల్లో పోటీ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు దోహదపడుతాయి’ అని వివరించారు. కార్యక్రమంలో ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్, ఏపీఎ్‌సఈసీఎం సీఈవో నాగలక్ష్మి, ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, తదితరులు పాల్గొన్నారు.