ఆయుష్ క్లినిక్స్‌కు ప్రభుత్వ గుర్తింపు
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:26 AM
రాష్ట్రంలో ఆయుష్ సేవల విస్తృతికి, నాణ్యతను పెంచుతూ ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచేందుకు అవసరమైన చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయుష్ సేవల విస్తృతికి, నాణ్యతను పెంచుతూ ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచేందుకు అవసరమైన చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి సత్యకుమార్ బుధవారం అసెంబ్లీలో ‘ఏపీ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్-2002 చట్టాని’కి సవరణ బిల్లును ప్రతిపాదించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయుష్ క్లినిక్‌లు, ఆసుపత్రులు ప్రస్తుతం ప్రభుత్వ నియంత్రణలో లేవన్నారు. వాటిని కూడా ప్రభుత్వ పరిధిలోకి తెస్తేనే.. వాటిపై నియంత్రణ ఉంటుందని అందుకే బిల్లును ప్రతిపాదించామని చెప్పారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్
చట్ట సవరణ బిల్లును ఆమోదించడంతో ప్రభుత్వానికి, మంత్రి సత్యకుమార్‌కు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ డైరెక్టర్ వేముల భానుప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ చట్టం ద్వారా ఆయుష్ క్లినిక్స్, హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ జరిగి, చట్టబద్ధ గర్తింపు లభిస్తుందన్నారు.