సచివాలయ పనులకు 2,316 కోట్లు
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:53 AM
అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది.
గుంటూరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. నీరుకొండలో ఐదెకరాల స్థలంలో నిర్మించనున్న ‘తెలుగు కల్చరల్ సెంటర్’కు రూ.119.27 కోట్లు విడుదల చేసింది. జీఏడీ టవర్‌తో పాటు, 1, 2, 3, 4 టవర్లలో హై సైడ్ ఎలక్ర్టికల్, హెచ్‌వీఏసీ, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్‌లు, ఫైర్ అలారం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ప్లంబింగ్ పనులు చేపడుతున్నారు. కాగా, సీఆర్డీయే ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపునకు సంబంధించి పలు సిఫారసులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీబీఎస్‌ఈ ప్రాంతీయ కార్యాలయానికి 0.8 ఎకరాలు, ఏపీఎ్‌సఐఆర్డీ అండ్ పీఆర్ విద్యా ప్రాంగణానికి 5.043 ఎకరాలు కేటాయించారు. ఎకరానికి రూ.4.1 కోట్ల ప్రీమియంతోపాటు చదరపు మీటరుకు ఏడాదికి రూపాయి లీజుకు ఈ భూములు అప్పగించారు. గతంలో నిడమర్రులో కిమ్స్, ఆదిత్య విద్యాసంస్థలకు 25 ఎకరాల చొప్పున భూములు కేటాయించారు. ఏడాదికి ఒక ఎకరానికి రూ.50 లక్షల చొప్పున 60 ఏళ్ల పాటు రెండు సంస్థలకు ఈ భూమిని లీజుకు ఇచ్చారు.