Share News

వైసీపీవి శవ రాజకీయాలు: గొట్టిపాటి

ABN , Publish Date - Jan 19 , 2026 | 03:46 AM

వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా జగన్‌కు బుద్ధి రాలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు.

వైసీపీవి శవ రాజకీయాలు: గొట్టిపాటి

అమరావతి, పోతినవారిపాలెం(పర్చూరు), జనవరి 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా జగన్‌కు బుద్ధి రాలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. ఆదివారం బాపట్ల జిల్లా కారంచేడు మండలం పోతినవారిపాలెంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారథ్యంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలు గు జాతి సత్తాను ప్రపంచానికి చా టిన మహనీయుడు ఎన్టీఆర్‌ అన్నా రు. దేశంలోనే కోటి సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని, టీడీపీ కార్యకర్తలు గట్టిగా గళమెత్తితే వైసీపీ భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ విలేకరులతో మంత్రి రవికుమార్‌ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే, టీడీపీ హయాంలో పంటభూములకు నీళ్లు పారుతున్నాయన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనకు రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో జరిగే హత్యల్ని రాజకీయ హత్యలుగా మార్చి కుట్రలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 03:47 AM