విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:11 AM
విశాఖపట్నంలో డేటా సెంటర్‌ను స్థాపిస్తున్నట్లు గూగుల్ ఇటీవల ప్రకటించిందని, సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి...
భారత్‌లో ఆ సంస్థ అతిపెద్ద పెట్టుబడి ఇదే
ఏఐ కోర్సుల రూపకల్పనకు పరిశ్రమలతో సంప్రదింపులు: కేంద్రం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో డేటా సెంటర్‌ను స్థాపిస్తున్నట్లు గూగుల్ ఇటీవల ప్రకటించిందని, సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని, ఇప్పటి వరకు భారత్‌లో గూగుల్ చేసిన అతిపెద్ద పెట్టుబడి ఇదేనని కేంద్ర ఎలకా్ట్రనిక్స్, సమాచార సాంకేతిక శాఖల సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. బుధవారం, లోక్‌సభలో ఎంపీ పుట్టా మహేష్ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. స్టాన్‌ఫర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్-2025 ప్రకారం 2013 నుంచి 2024 వరకు భారత్‌లో ఏఐ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు సుమారు 11.1 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయని కేంద్రమంత్రి తెలిపారు. ఏఐ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలతో సంప్రదింపులు జరిపి కోర్సుల రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు.