Share News

పర్యావరణ అనుమతుల కోసం గూగుల్‌ దరఖాస్తు

ABN , Publish Date - May 14 , 2026 | 05:51 AM

విశాఖ సమీపంలోని అడవివరం వద్ద సింహాచలం దేవస్థానం నుంచి తీసుకున్న భూముల్లో హైపర్‌ స్కేల్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ...

పర్యావరణ అనుమతుల కోసం గూగుల్‌ దరఖాస్తు

  • డేటా సెంటర్‌తో సింహాచలం గుడికి ఏటా 26 కోట్ల ఆదాయం

విశాఖపట్నం, మే 13(ఆంధ్రజ్యోతి): విశాఖ సమీపంలోని అడవివరం వద్ద సింహాచలం దేవస్థానం నుంచి తీసుకున్న భూముల్లో హైపర్‌ స్కేల్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం గూగుల్‌ సంస్థ దరఖాస్తు చేసింది. ఇక్కడ గూగుల్‌కు 160 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం దేవస్థానానికి లీజు కింద ఏడాదికి రూ.26.45 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. దీంతో పాటు విశాఖ జిల్లా ఆనందపురం తర్లువాడలో 266.6 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఏపీఐఐసీకి చెందిన 174.8 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. తర్లువాడలో డేటా సెంటర్‌ నిర్మాణానికి గత నెల 28న సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. అక్కడ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాంబిల్లిలో డేటా సెంటర్‌ నిర్మాణానికి అవసరమైన అనుమతులకు దరఖాస్తు చేశారు.

Updated Date - May 14 , 2026 | 05:51 AM