వైజాగ్ మెగా డేటా సెంటర్
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:54 AM
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పనులు వేగవంతమయ్యాయి. ఏప్రిల్‌లో భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తర్లువాడలో 266 ఎకరాల్లో నిర్మాణం
బిల్డింగ్ ప్లాన్ సమర్పించిన గూగుల్
ఏప్రిల్‌లో భూమి పూజకు సన్నాహాలు
విశాఖపట్నం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పనులు వేగవంతమయ్యాయి. ఏప్రిల్‌లో భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాణ అనుమతుల కోసం ఆ సంస్థ తన బిల్డింగ్ ప్లాన్‌ను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ డేటా సెంటర్ నిమి త్తం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మొత్తం 601.4 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆనందపురం మండలం తర్లువాడలో 266.6 ఎకరాలు, ముడసర్లోవ (అడవివరం)లో 160 ఎకరాలు, రాంబిల్లిలో 174.8 ఎకరాలు ఇచ్చింది. గూగుల్ నోటిఫైడ్ భాగస్వామి అదానీ ఇన్‌ఫ్రా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చూస్తుంది. ఇందుకోసం మూడు ఎస్‌పీవీలను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా తొలుత తర్లువాడలో ‘వైజాగ్ మెగా డేటా సెంటర్’ను నిర్మించనున్నారు. సర్వే నం. 1, 35, 71, 72, 73-2, 74, 75లలో 266 ఎకరాలు ఉండగా అందులో 33ు పార్కింగ్‌కు కేటాయించార ు. మరో 59.91 ఎకరాల్లో గ్రీన్‌బెల్ట్‌ను 2మీ. వెడల్పున ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రధాన భవనం (జీ+2) మొత్తం బిల్టప్ ఏరియా 15,40,566. 715 చదరపు అడుగులు కాగా, ఉపరితల పార్కింగ్ 7,54,894 చ.అ., రహదారుల కోసం 88,893.36 చ.మీ. కేటాయించారు. భవిష్యత్తులో విస్తరణ కో సం 3,79,268.76 చ.మీటర్లు విడిచి పెడుతున్నట్టు ప్లాన్‌లో చూపించారు. ఇప్పుడు చేపట్టబోయేది ఫేజ్-1 నిర్మాణంగా పేర్కొన్నారు. ఈ భూ ముల్లో ఉన్న చెరువులు, నీటి కుంటలను యథాతథంగా ఉంచుతూ వాటిని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ ప్లాన్‌కు పర్యావరణ అనుమతులు రాగా నే పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఏపీఐఐసీ వర్గాలు తెలిపాయి.