Share News

గూగుల్‌ డేటా సెంటర్లకు పర్యావరణ అనుమతి

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:49 AM

ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థ ‘గూగుల్‌’ విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ (వైజాగ్‌ మెగా డేటా సెంటర్‌ పార్కు లిమిటెడ్‌), అనకాపల్లి జిల్లా...

గూగుల్‌ డేటా సెంటర్లకు పర్యావరణ అనుమతి

  • ఈ నెల 28న తర్లువాడ సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థ ‘గూగుల్‌’ విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ (వైజాగ్‌ మెగా డేటా సెంటర్‌ పార్కు లిమిటెడ్‌), అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పారిశ్రామికవాడ (వైజాగ్‌ రాంబిల్లి డేటా సెంటర్‌ పార్కు లిమిటెడ్‌)లో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పర్యావరణ అనుమతులు ఇచ్చింది. తర్లువాడలో ఏర్పాటు కానున్న గూగుల్‌ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నారు. రూ.26,400 కోట్లతో తర్లువాడలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్‌కు ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా 266.66 ఎకరాలు కేటాయించింది.

Updated Date - Apr 25 , 2026 | 04:49 AM