Share News

ఏప్రిల్‌లో గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:44 AM

విశాఖపట్నంలో వేయి మెగావాట్ల సామర్థ్యం కలిగిన గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ నిర్మాణానికి ఏప్రిల్‌ మొదటి వారంలో శంకుస్థాపన జరగనుంది.

ఏప్రిల్‌లో గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

  • విశాఖలోని తర్లువాడలో భూమిని పరిశీలించిన అధికారులు

విశాఖపట్నం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో వేయి మెగావాట్ల సామర్థ్యం కలిగిన గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ నిర్మాణానికి ఏప్రిల్‌ మొదటి వారంలో శంకుస్థాపన జరగనుంది. డేటా సెంటర్‌ కోసం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో ప్రభుత్వం మొదట 480 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ భూమి సరిపోదని ఇంకా అదనంగా కావాలని గూగుల్‌ ప్రతినిధులు కోరడంతో ఆనందపురం మండలం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 174.8 ఎకరాలు కలిపి మొత్తం 601.4 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. తర్లువాడలో తొలుత డేటా సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ మంగళవారం విశాఖపట్నం వచ్చారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, ఏపీఐఐసీ అధికారులతో కలిసి తర్లువాడ భూములను పరిశీలించారు.

Updated Date - Mar 11 , 2026 | 05:45 AM