Share News

‘గూగుల్‌ డేటా’ భవనాలకు పీసీబీ అనుమతి

ABN , Publish Date - May 27 , 2026 | 04:38 AM

మ్మడి విశాఖ జిల్లాలో గూగుల్‌ డేటా సెంటర్ల కోసం భవనాల నిర్మాణానికి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

‘గూగుల్‌ డేటా’ భవనాలకు పీసీబీ అనుమతి

విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లాలో గూగుల్‌ డేటా సెంటర్ల కోసం భవనాల నిర్మాణానికి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. గూగుల్‌కు తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో 604 ఎకరాల భూమి కేటాయించిన విషయం తెలిసిందే. మొదట తర్లువాడ, రాంబిల్లిల్లో భవన నిర్మాణాలకు ఆ సంస్థ అనుమతి కోరింది. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఏడేళ్ల వరకు అనుమతులు వర్తిస్తాయని పేర్కొన్నారు. డేటా సెంటర్లు ఆపరేషన్‌లోకి తీసుకువచ్చే ముందు పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ నుంచి డీజిల్‌ నిల్వలకు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

Updated Date - May 27 , 2026 | 04:40 AM