Share News

నాడు బర్రెలతో వెలవెల.. నేడు కార్ల కళకళ

ABN , Publish Date - Feb 09 , 2026 | 05:23 AM

వైసీపీ హయాంలో గొల్లపూడిలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ భవనం వద్ద అప్పట్లో నిత్యం గేదెలు సంచరిస్తుండేవి.

నాడు బర్రెలతో వెలవెల.. నేడు కార్ల కళకళ

  • సందడిగా గొల్లపూడి బీసీ సంక్షేమ భవనం

వైసీపీ హయాంలో గొల్లపూడిలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ భవనం వద్ద అప్పట్లో నిత్యం గేదెలు సంచరిస్తుండేవి. ఇప్పుడు ఆ ప్రాంతం అధికారులు, బీసీ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, వారికి కేటాయించిన కార్లు, సందర్శకుల రాకపోకలతో సందడిగా మారింది. వైసీపీ హయాంలో ఈ అపార్డ్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న అప్పటి ప్రభుత్వం.. కేవలం బోర్డు ఏర్పాటు చేసి ఇదే బీసీ సంక్షేమ భవనం అని సరిపెట్టుకుంది. కార్యాలయాల్లో ఫర్నిచర్‌ పూర్తిగా ఏర్పాటు చేయడం గాని, అక్కడ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు కూర్చోని విధులు నిర్వహించిన దాఖలాలు గానీ లేవు. దీంతో ఖాళీగా ఉన్న బీసీ సంక్షేమ భవనంలో బర్రెలు సంచరిస్తుండటాన్ని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రముఖంగా ఫోటోలు ప్రచురించింది. కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత ఈ సంక్షేమ భవనంలో జరిగే కార్యక్రమాలకు ఆ శాఖ మంత్రి ఎస్‌.సవిత, ఉన్నతాధికారులు తరచుగా హాజరవుతున్నారు. దీంతో ఒకప్పుడు బర్రెలు సంచరించిన ఈ ప్రాంతంలో ఇప్పుడు కార్పొరేషన్ల పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, కార్లు, అధికారులతో కళకళలాడుతోంది.

-ఆంధ్రజ్యోతి, అమరావతి

Updated Date - Feb 09 , 2026 | 05:24 AM