మోదీ పిలుపు స్వర్ణకారుల పొట్టగొట్టడమే
ABN , Publish Date - May 20 , 2026 | 05:58 AM
బంగారం కొనవద్దని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు నిరసనగా స్వర్ణకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో స్వర్ణకారులు..
ప్రొద్దుటూరులో దుకాణాలు మూసివేసి నిరసన
ప్రొద్దుటూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): బంగారం కొనవద్దని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు నిరసనగా స్వర్ణకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో స్వర్ణకారులు దుకాణాలు, వర్కు షాపులు మూసివేసి నిరసన చేపట్టారు. దీంతో మంగళవారం ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్ బోసిపోయింది. మెయిన్ బజారు నుంచి స్వర్ణకారులు తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా స్వర్ణకారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలూరు ఇలియాస్ బాషా మాట్లాడుతూ ఏడాదిపాటు బంగారం కొనవద్దని ప్రజలకు పిలుపునివ్వడం స్వర్ణకారుల పొట్టగొట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు బంగారు షరాబు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు కొప్పర్తి మధు తదితరులు పాల్గొన్నారు.