Share News

రాఘవరాయలకు నూతన స్వర్ణ పాదుకలు

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:54 AM

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి నూతన బంగారు పాదుకలను సమర్పించారు. గతంలో బృందావనం వద్ద వెండి పాదుకలు ఉండేవి.

రాఘవరాయలకు నూతన స్వర్ణ పాదుకలు

  • రెండు కేజీల వెండి, అర్ధ కేజీ బంగారంతో తయారు చేయించిన పీఠాధిపతి

మంత్రాలయం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి నూతన బంగారు పాదుకలను సమర్పించారు. గతంలో బృందావనం వద్ద వెండి పాదుకలు ఉండేవి. పీఠాధిపతి సుబధేంద్ర తీర్థులు తన పాద కానుకల నుంచి వచ్చిన మొత్తంలో రెండు కేజీల వెండి, అర్ధ కేజీ బంగారంతో నూతన పాదుకలు తయారు చేశారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ శిల్పి కళాకారులు మంజునాథ్‌ బ్రదర్స్‌ శ్రీనివాసరాజు వీటిని రూపొందించారు. రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన గురువారం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మూల బృందావనానికి బంగారు కవచ సమర్పణతో పాటు బంగారు పాదుకలను ఉంచి పూజలు చేశారు.

Updated Date - Aug 07 , 2026 | 04:57 AM