ఆలూరు క్రీడాకారుడికి బంగారు పతకం
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:44 PM
దక్షిణాసియా సెపక్‌తక్రా పోటీలు ఈనెల 7, 8వ తేదీల్లో కొలంబియాలో జరిగాయి.
ఆలూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): దక్షిణాసియా సెపక్‌తక్రా పోటీలు ఈనెల 7, 8వ తేదీల్లో కొలంబియాలో జరిగాయి. పోటీల్లో ఆలూరుకు చెందిన క్రీడాకారుడు కురువ మధు ఇండియా జట్టు నుంచి ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్నాడు. ఫైనల్‌లో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయి బంగారం పతకం సాధించారు. ఈ సందర్భంగా సెపక్‌తక్రా ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రేమరాజ్ హర్షం వ్యక్తం చేశారు. తమ కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడంపై తల్లిదండ్రులు కురువ బసవరాజు, సరస్వతి ఆనందం వ్యక్తం చేశారు.