Share News

సంతకు వెళ్తూ అనంత లోకాలకు..

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:45 PM

సంతలో వ్యాపారం చేసుకునేందుకు వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.

   సంతకు వెళ్తూ అనంత లోకాలకు..
మృతి చెందిన మహుబుబ్‌బాష

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

ఆళ్లగడ్డ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): సంతలో వ్యాపారం చేసుకునేందుకు వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై నంద్యాల రోడ్డు లోని వేర్‌ హౌస్‌ గోదాము వద్ద చోటుచేసుకున్నట్లు పట్టణ పోలీసులు తెలి పారు. వివరాలు.. పట్టణంలోని వీవర్స్‌ కాలనీలో నివాసముంటున్న మహబుబ్‌బాష(59), భార్య నూర్‌జహాన భార్యాభర్తలు. వీరు చాపల వ్యాపారంచేస్తూ జీవనం సాగించేవారు. శని వారం కడప జిల్లా మైదుకూరులో జరిగే సంతలో వ్యాపారం చేసేందుకు ఇద్దరు బైక్‌పై బయ లుదేరారు. జాతీయ రహదారి దాటుతుండగా నంద్యాల నుంచి కడప వైపు వెళ్తున్న బొలెరో వాహనం అతి వేగంగా ఢీకోంది. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటా హుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహహబూబ్‌బాష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Mar 14 , 2026 | 11:45 PM