మహాగౌరిగా భ్రమరాంబ
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:39 AM
శ్రీశైల మహా క్షేత్రంలో శరన్నవరాత్రులు కనుల పండువగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు ఆదివారం భ్రమరాంబికాదేవి మహాగౌరిగా భక్తులకు దర్శమిచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నందివాహనంపై పుర వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
మహాగౌరిగా భ్రమరాంబ
స్వామి, అమ్మవార్లకు నంది వాహన సేవ
శ్రీశైలం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో శరన్నవరాత్రులు కనుల పండువగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు ఆదివారం భ్రమరాంబికాదేవి మహాగౌరిగా భక్తులకు దర్శమిచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నందివాహనంపై పుర వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, చండీ రుద్రహోమాలు, కుమారి, సుహాసిని పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. భ్రామరిని మహాగౌరి అలంకారంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. చతుర్భుజాలు కలిగిన ఈ దేవి నాలుగు చేతులతో కుడివైపున త్రిశూలం అభయహస్తంతో, ఎడమ వైపు ఢమరుకం వరముద్రలను ధరించి శాంతమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు నందివాహనంపై షోడశోపచార పూజా క్రతువులు జరిపించి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. శరన్నవరాత్రులలో సోమవారం అమ్మవారు సిద్ధిదాయిని అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామి, అమ్మవార్లకు కైలాసవాహన సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.