పెరిగిన గోదావరి నీటి మట్టం
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:00 AM
పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం బుధవారం అనూహ్యంగా పెరిగింది.
మునిగిన గండిపోశమ్మ ఆలయం
పోలవరం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం బుధవారం అనూహ్యంగా పెరిగింది. ఎగువ కాఫర్ డ్యాం వద్ద నీటిమట్టం పెరగడంతో సమీపాన ఉన్న మాతృశ్రీ గండి పోశమ్మ ఆలయం నీట మునిగింది. ఎగువ ప్రాంతాల్లో సీలేరు ఇతర ప్రాజెక్టుల నుంచి దిగువకు వస్తున్న జలాలను కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో గోదావరి నీటిమట్టం క్రమబద్దీకరణ కోసం గేట్లను మూసివేసిన కారణంగా నదిలో నీటి మట్టం పెరిగింది.