Share News

కలుషితమై నది

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:41 AM

కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పలుకులు అవాస్తవాలని.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేయించిన నీటి పరీక్షలు నిజమని.. జీవనది గోదావరి నీరు వాడకానికి పనిచేయదని ఈ చిత్రాలు రుజువు చేస్తున్నాయి.

కలుషితమై నది

  • గోదావరిలో కాలుష్య కోరలివిగో..!

  • జలాలు తగ్గడంతో వెలుగు చూస్తున్న నిజాలు

కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పలుకులు అవాస్తవాలని.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేయించిన నీటి పరీక్షలు నిజమని.. జీవనది గోదావరి నీరు వాడకానికి పనిచేయదని ఈ చిత్రాలు రుజువు చేస్తున్నాయి. ప్రస్తుతం నదిలో జలాలు తగ్గడంతో గోదావరి ఘాట్లలోని కాలుష్య కోరలు వెలుగు చూస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆ చివర కోటిలింగాల ఘాట్‌ అవతల నుంచి ఇటు ధవళేశ్వరం వరకూ ఇదే దుస్థితి దర్శనమిస్తోంది..! నీటిలో నాచు భారీగా పేరుకుపోగా.. ఒడ్డున ప్లాస్టిక్‌ తదితర వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా తిష్టవేశాయి. డిప్యూటీ సీఎం పవన్‌ గతనెల 25న గోదావరి ఘాట్లను పరిశీలించిన సమయంలో నీరు కాస్త ఎక్కువగా ఉంది. దీంతో పరిస్థితి మరీ ఇంత దారుణంగా కనిపించలేదు. కానీ.. పవన్‌ పట్టుబట్టి మరీ ఇక్కడి నీటి నమూనాలను పరీక్ష చేయించారు. అయితే.. పీసీబీకి ఇవేమీ కనిపించలేదు. పుష్కరాలు వచ్చే ఏడాది దాదాపుగా ఇదే సమయంలో రానున్నాయి. అప్పుడు కూడా గోదావరి నీళ్లు, ఘాట్లు ఇలాగే ఉంటే పాలకులు తలదించుకోవాల్సిందే. భక్తులు రోగాల పాలవుతారు. ఈ ప్రమాదాలను ముందే ఊహించిన పవన్‌.. గోదావరి ప్రక్షాళనకు నడుం బిగించారు. దీనికోసం ఏకంగా రూ.100 కోట్ల నిధులు కేటాయించారు. ఆయన ఎందుకు అంత తీవ్రంగా, వేగంగా స్పందించారో.. ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. ఈ ఫొటోల్లోని స్నానాల రేవులు పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యమైనవి కావడం గమనార్హం.

- రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 18 , 2026 | 03:42 AM