Share News

కాస్త శుభ్రమై‘నది’!

ABN , Publish Date - Jun 22 , 2026 | 06:39 AM

ఈ ఫొటోలు చూశారా?.. ఒడ్డున తీసే కొద్దీ చెత్త.. నదిలో తొలగించే కొద్దీ నాచు, వ్యర్థాలు, రంగు మారిపోతున్న నీళ్లు.. ఇది గోదారి ఆవేదనకు కారణమవుతున్న కాలుష్యం!

కాస్త శుభ్రమై‘నది’!

  • గోదావరిలో తీసే కొద్దీ చెత్త, నాచు

ఈ ఫొటోలు చూశారా?.. ఒడ్డున తీసే కొద్దీ చెత్త.. నదిలో తొలగించే కొద్దీ నాచు, వ్యర్థాలు, రంగు మారిపోతున్న నీళ్లు.. ఇది గోదారి ఆవేదనకు కారణమవుతున్న కాలుష్యం! తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి నది, రేవుల్లో పేరుకు పోతున్న వ్యర్థాలు.. దుర్వాసనపై ఈ నెల 18న ‘కాలుష్యమై నది’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 22(నేడు)న రాజమహేంద్రవరం రానున్నారని ముందుగా సమాచారం వచ్చింది. దీంతో ఆదివారం పలు ఘాట్లు, నదిలో వ్యర్థాలను తొలగించే పనిని అధిరానేలే కాస్త చిత్తశుద్ధితో చేపట్టారు. ఒడ్డున ఉన్న వ్యర్థాలను, గోదావరిలో పడవలతో నాచును తీయించి తరలించారు. నదిలో వ్యర్థాలు తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. దీంతో కనబడే మేర శుభ్రం చేశారు.

- రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 22 , 2026 | 06:40 AM