Share News

గోదావరి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం: అచ్చెన్న

ABN , Publish Date - Feb 19 , 2026 | 06:02 AM

ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజీల సమస్య శాశ్వత పరిష్కారం కోసం సర్వే జరుగుతోందని, ఈ ప్రాజెక్టుకు రూ.17 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

గోదావరి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం: అచ్చెన్న

ఇంటర్నెట్ డెస్క్: ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజీల సమస్య శాశ్వత పరిష్కారం కోసం సర్వే జరుగుతోందని, ఈ ప్రాజెక్టుకు రూ.17 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సర్వే పూర్తయిన వెంటనే బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామన్నారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేసనపల్లి, శంకరగుప్తం తదితర గ్రామాల్లో లక్ష కొబ్బరి చెట్లు పాడైపోయిన నేపథ్యంలో చెట్టుకు రూ.1,000 చొప్పున రూ.18 కోట్ల నష్టపరిహారాన్ని అందించే ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Feb 19 , 2026 | 06:03 AM