Share News

గోదావరి-కావేరి అనుసంధానం పోలవరం నుంచే జరగాలి

ABN , Publish Date - May 09 , 2026 | 04:40 AM

హిమాలయన్‌-మహానది-గోదావరి-కావేరి నదుల అనుసంధాన పథకాన్ని పోలవరం నుంచే అమలు చేయాలని జాతీయ నదీజలాల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

గోదావరి-కావేరి అనుసంధానం పోలవరం నుంచే జరగాలి

  • ఎన్‌డబ్ల్యూడీఏ భేటీలో ఏపీ స్పష్టీకరణ

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): హిమాలయన్‌-మహానది-గోదావరి-కావేరి నదుల అనుసంధాన పథకాన్ని పోలవరం నుంచే అమలు చేయాలని జాతీయ నదీజలాల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం ఢిల్లీలో సంస్థ చైర్మన్‌ రామేశ్వర్‌ ఠకూర్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవివాదాల విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ సుగుణాకరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌ మీదుగా కావేరి వరకు తీసుకెళ్లాలని.. లేదంటే సమ్మక్క సారలమ్మ పథకం నుంచి ఎత్తిపోయాలని తెలంగాణ చేస్తున్న వాదనలతో తాము ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. పోలవరం నుంచి నల్లమలసాగర్‌ ద్వారా కావేరికి జలాలను తరలించాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వ అభిప్రాయాన్ని సర్వసభ్యసమావేశం నోట్‌ చేసుకుంది. ఈ భేటీకి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు.

Updated Date - May 09 , 2026 | 04:41 AM