ఆలయాల్లో నాణ్యతా నిర్ధారణ ల్యాబ్‌లు
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:55 AM
భక్తుల విశ్వాసాలకు తగ్గట్టుగా పూర్తి నాణ్యతతో కూడిన ప్రసాదాలు అందజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల పరిధిలో...
గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు సూచన
సింహాచలం(విశాఖపట్నం), ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): భక్తుల విశ్వాసాలకు తగ్గట్టుగా పూర్తి నాణ్యతతో కూడిన ప్రసాదాలు అందజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల పరిధిలో ఆధునిక నాణ్యతా నిర్ధారణ లేబొరేటరీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు సూచించారు. శనివారం ఆయన సతీసమేతంగా సింహాచలేశుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మా ట్లాడుతూ... తిరుమల లడ్డూకు వినియోగించిన నెయ్యిలో రసాయనాలు క లిశాయంటూ వస్తున్న వార్తలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రాజకీయాల కోసం వైసీపీ నాయకులు మండలిలో వెంకన్న ఫొటోల ప్రదర్శన మనస్తాపానికి గురిచేసిందని అన్నారు.