Share News

బాలికలదే హవా

ABN , Publish Date - Apr 30 , 2026 | 11:38 PM

పదో తరగతి ఫలితాలు ఫలితాలు గురువారం విడుదల కాగా ఈసారి బాలికలదే హవా కొనసాగింది.

బాలికలదే హవా

‘పది’ ఫలితాల్లో జిల్లా ఉత్తీర్ణత శాతం 71.08

బాలికలు 76.94 శాతం ఉత్తీర్ణత

బాలురు 65.62 శాతం

34పాఠశాలలో వంద శాతం పాస్‌

జిల్లా వ్యాప్తంగా 6,021 మందికి 500కు పైగా మార్కులు

కర్నూలు ఎడ్యుకేషన, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాలు ఫలితాలు గురువారం విడుదల కాగా ఈసారి బాలికలదే హవా కొనసాగింది. కర్నూలు జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలోని 552 ఉన్నత పాఠశాలల నుంచి మొత్తం 33,533 మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 23,836 మంది పాసై 71.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 16,185 మంది పరీక్షలకు హాజరు కాగా 12,453 మంది పాసై 76.94శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో 25వ స్థానంలోకి పడిపోయింది. గత ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని పోల్చుకుంటే ఈ సారి అదనంగా 5శాతం ఉత్తీర్ణత సాధించినా రాష్ట్రంలో కర్నూలు జిల్లా స్థానం చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 23,443మంది ఉత్తీర్ణత సాధిం చగా.. అందులో ప్రథమశ్రేణిలో 16,974 మంది, ద్వితీయ 4,529, తృతీయ శ్రేణిలో 23,33 మంది పాసయ్యారు. కర్నూలు నగరంలోని డా.ఏపీజే అబ్దుల్‌ కలాం ము న్సిపల్‌ కార్పొరేషన హై స్కూల్‌ వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇలా వంద శాతం ఉత్తీర్ణతతో 5వసారి తన రికార్డును బద్దలు కొట్టింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థిని పిక్కిలి లిఖిత 593/600, పి.గిరీష 591, ఎం.మేఘన 587 మార్కులు సాధించారు. గత ఏడాది ఈ పాఠశాలలో వంద శాతంతో రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుని విద్యార్థులు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డును అందుకున్నారు. జిల్లాలోని ఆస్పరి మండలం ఇటుకలమర్రి ఆదర్శ పాఠశాల విద్యార్థి పి.మహేష్‌ 588/600 మార్కులు సాదించారు. కర్నూలు నగరం శ్రీచైతన్య పాఠశాలకు చెందిన తబుస్మా అమైర్‌ 597/600 మార్కులు సాధించారు. మాధవీనగర్‌లోని నారాయణ పాఠశాలకు చెందిన కాల్వ విజ్ఞత 597/600, ఆదోని కిడ్స్‌ హై స్కూల్‌ చెందిన మహ్మద్‌ తాహేర్‌ 596/600, కర్నూలు రవీంద్ర విద్యానికేతన పాఠశాల చెందిన విద్యార్థిని జైత్రి సాయి మీనాక్షి 596/600 మార్కులు సాదించి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారు. కర్నూలు జిల్లాలో 34 ఉన్నత పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. జీరో ఉత్తీర్ణత శాతం ఒక్కటి కూడా నమోదు కాలేదు.

ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో టాపర్స్‌

కర్నూలులోని డా.ఏపీజే అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ మున్సిప్‌ కార్పొరేషన హై స్కూల్‌లో పిక్కిలి లిఖిత 593, కాల్వబుగ్గ ఏపీఆర్‌ఎస్‌ (బీ) పాఠశాలలో హర్షవర్దన 593 మార్కులు సాధించారు. డా.ఏపీజే అబ్దుల్‌ కలాం మున్సిపల్‌ కార్పొరేషన పాఠ శాల విద్యార్థిని పి.గిరీష 591, నాగులదిన్నె జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు చెందిన జంబుల వీరేష్‌ 591 మార్కులొచ్చాయి. చిన్నటేకూరు జిల్లా పరిషత ఉన్నత పాఠశా లకు చెందిన జి.మిథున కుమార్‌ 590మార్కులు సాధించారు. ప్రభుత్వ యా జమాన్యాల పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడంతో పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ అన్ని యాజమాన్య పాఠశా లలో 500 మార్కులు పైగా సాదించిన విద్యార్థులు 6021 మంది ఉన్నారు. ఇందులో బాలురు 2651 మంది కాగా, బాలికలు 3370 మంది ఉన్నారు.

మే 25 నుంచి అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ

పదో తరగతి అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన 4వ తేదీ వరకు కొనసాగుతాయని డీఈవో ఎల్‌.సుధాకర్‌ తెలిపారు. మే 1 నుంచి 9 వరకు విద్యార్థులు పరీక్ష రుసుమును పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెల్లించా లన్నారు. రూ.50 అపరాధ రుసుంతో మే 10 నుంచి 24వ తేదీ వరకు పరీక్ష రుసుం చెల్లించాలన్నారు. రీకౌంటింగ్‌, రివెరిఫికేషన కోసం మే 1 నుంచి 7వ తేదీ వరకు ఆనలైనలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీకౌంటింగ్‌కు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు.

ఓపెన స్కూల్స్‌ ఫలితాలు విడుదల

కర్నూలు ఎడ్యుకేషన, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు మొత్తం విద్యార్థులు 1524 మంది హాజరు కాగా, 230 మంది హాజరై 15.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఓపెన స్కూల్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షకు జిల్లాలో 1311 మంది విద్యార్థులు హాజరు కాగా 417 మంది పాసై 31.81శాతం ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి, ఇంటర్‌ అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్‌కు రూ.200 చెల్లించి, సబ్జెక్టుకు రూ.1000లు రి వెరిఫికేషనకు ఇంప్రూవ్‌మెంటు కోసం పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. మే 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. అభ్యర్థులు నగదు చెల్లింపులు ఏపీ ఆనలైన ద్వారా కానీ పేమెంట్‌ గేట్‌ వే ద్వారా చెల్లించాలని డిఈవో తెలిపారు.

Updated Date - Apr 30 , 2026 | 11:38 PM