Share News

బాలికలదే హవా

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:14 AM

ఇంటర్‌ ఫలితాలు బుధవారం విడుదల కాగా జిల్లాలో బాలికలదే హవా కొనసాగింది.

బాలికలదే హవా

ఫస్టియర్‌లో 70.50శాతం ఉత్తీర్ణతతో 25వ స్థానం

సెకండియర్‌లో ఉత్తీర్ణత 78.56శాతంతో 19వ స్థానం

ప్రైవేట్‌ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు

నంద్యాల ఎడ్యుకేషన, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాలు బుధవారం విడుదల కాగా జిల్లాలో బాలికలదే హవా కొనసాగింది. జిల్లాలో 125 కళాశాలల నుంచి ఫస్టియర్‌కు మొత్తం 14,098 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 6,404 మంది బాలురు, 3,600 మంది ఉత్తీర్ణులై 56.22 శాతం ఫలితాలను సాధించారు. 7694 మంది బాలికలు పరీక్షలు రాయగా 5424 మంది ఉత్తీర్ణులై 70.50శాతం ఫలితాలను సాధించారు. ఈ ఏడాది 66 శాతం ఫలితాలతో 25వ స్థానానికి పడిపోయింది.

సెకండియర్‌లో..

ద్వితీయ సంవత్సరంలో కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. 12,657 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 9,290 మంది ఉత్తీర్ణులై 78.56శాతం ఫలితాన్ని సాధించారు. 5,679 మంది బాలురు పరీక్షలు రాయగా 3,815 మంది ఉత్తీర్ణులై 67.18 శాతం ఫలితాన్ని సాధించారు. 6,978 మంది బాలికలు పరీక్షలు రాయగా 5,482 మంది ఉత్తీర్ణులై 78.56శాతం సాధించారు. ఈ ఏడాది 76శాతం ఫలితాలతో 19వ స్థానానికి దిగజారింది.

కొంతమేర నిరుత్సాహ పరిచినా..

ఇంటర్‌ ఫలితాల్లో ప్రతియేటా వెనుకంజలో ఉన్న ప్రభుత్వ కళాశాలలు ఈసారి ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా ఫలితాలను రాబట్టాయి. రాష్ట్రస్థాయిలో ఫలితాలు కొంతమేరకు నిరుత్సాహ పరిచినా జిల్లాలో ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా ఉత్తీర్ణతా శాతాన్ని మెరుగుపరుచుకోవడం విశేషం.

ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు

జిల్లాలోని 21 ప్రభుత్వ కళాశాలల్లో ఫస్టియర్‌ 2,599 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1170మంది ఉత్తీర్ణులై 45.02శాతం ఫలితాన్ని సాఽధించారు. సెకండియర్‌ 2,203 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,498 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 67.99శాతం ఫలితాలను సాధించారు.

ఫ ప్రైవేట్‌ కళాశాలల్లో ఫలితాలు

జిల్లాలోని 46 జనరల్‌ ప్రైవేట్‌ కళాశాలల్లో ఫస్టియర్‌ 8,147 మంది విద్యార్థులకు గాను 5,261 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 64.57శాతం ఫలితాన్ని పొందారు. సెకండియర్‌లో 7,492 మంది విద్యార్థులకు గాను 5,321 మంది ఉత్తీర్ణులై 71.02 శాతం ఫలితాలను సాధించారు.

బీసీ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో

జిల్లాలో 3 బీసీ వెల్ఫేర్‌ కళాశాలలు ఉండగా ఫస్టియర్‌లో 243 మంది విద్యార్థులకు గాను 230 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 94.65 శాతాన్ని కైవసం చేసుకున్నారు. సెకండియర్‌లో 224 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 238 మంది ఉత్తీర్ణులయ్యారు.

సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో..

జిల్లాలో 6 సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలుండగా ఫస్టియర్‌లో 441 మంది విద్యార్థులకు గాను 410 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 93శాతం ఫలితాలను సాధించారు. సెకండియర్‌లో 390 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 377 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 97శాతం ఫలితాలను రాబట్టారు.

ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలల్లో..

జిల్లాలోని 3 ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలల్లో ఫస్టియర్‌లో 282 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 252 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 295 మంది విద్యా ర్థులు పరీక్షలు రాయగా 268మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 90.85శాతం ఫలితాన్ని సాధించారు.

ఒకేషనల్‌ కళాశాలల్లో..

జిల్లాలోని 27 ఒకేషనల్‌ కళాశాలల్లో ఫస్టియర్‌లో 1,343 మంది విద్యార్థులు హాజ రుకాగా 688 మంది విద్యార్థులు ఉత్తీర్థులై 51.23శాతం ఫలితాలను సాధించారు. సెకండియర్‌లో 1,233 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 827 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 67.08 శాతం ఫలితాలను పొందారు.

ఫస్టియర్‌లో ఉత్తీర్ణత 73 శాతంతో రాష్ట్రంలో 14వ స్థానం

సెకండియర్‌లో 85శాతం ఉత్తీర్ణతతో 8వ స్థానం

హర్షం వ్యక్తం చేసిన విద్యా శాఖాధికారులు

కర్నూలు ఎడ్యుకేషన, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్ష ఫలితాలు బుధవా రం విడుదలయ్యాయి. ఈఏడాది కూడా ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఈ ఫలితాలపై విద్యా శాఖాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళా శాలలు మొత్తం 167 ఉన్నాయి. ఫస్టియర్‌లో 23,169 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 16,356 మంది పాసై 73శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 11,725 మంది పరీక్షలకు హాజరు కాగా, 9,189 మంది పాసై 78 శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలు అగ్రస్థానంలో నిలిచారు. బాలురు మొత్తం 11,444 మంది పరీక్షలకు హాజరు కాగా 7,767మంది పాసై 63 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలే 15 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కర్నూలు జిల్లాలో 73 శాతం ఉత్తీర్ణత సాదించి రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది.

ద్వితీయ సంవత్సరంలో 19,250 మంది విద్యార్థులు..

సెకండియర్‌లో 19,250 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 16,077 మంది పాసై 85 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 10,113 మంది పరీక్షలకు హాజరు కాగా, 8,932 మంది పాసై 88 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలుర విభా గంలో 9,137 మంది పరీక్షలకు హాజరు కాగా 7,145 మంది పాసై 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలే పది శాతం అత్యధికంగా ఉత్తీర్ణత సాధించి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారు. 85శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో కర్నూలు జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది.

మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి జూన 4వ తేదీ వరకు కొనసాగుతున్నట్లు ఆర్‌ఐవో జి.లాలెప్ప తెలిపారు. ఈపరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యా హ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు కొనసాగుతాయన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఇంప్రూమెంట్‌ సౌకర్యం ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 20 నుంచి 27వ తేదీలోగా పరీక్ష రుసుం చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారన్నారు. రీకౌంటింగ్‌, రీ-వెరిఫికేషన కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఏప్రిల్‌ 20 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీకౌంటింగ్‌కు ప్రతి పేపరుకు రూ.260, రీవెరిఫికేషన ప్రతి పేపరుకు రూ.1,300 రుసుం చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌ఐవో పేర్కొన్నారు.

ఫలితాలు సంతృప్తినిచ్చాయి

ఇంటర్‌ ఫలితాలు సంతృప్తినిచ్చాయి. ఇంటర్‌ బోర్డు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే జిల్లాలో ప్రాక్టికల్స్‌, థియరీ, మూల్యాంకనం పూర్తిచేసేందుకు సహ కరించిన కళాశాల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వాటిని సక్రమంగా అమలు చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. సమష్టి కృషి ఫలితమే.

ఫ జి.లాలెప్ప, ఆర్‌ఐవో, కర్నూలు

Updated Date - Apr 16 , 2026 | 12:14 AM