Girisha Appointment: సెంట్రల్ సిల్క్ బోర్డు డైరెక్టర్‌గా గిరిషా
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:45 AM
ఏపీఎంఎస్ఐడీసీ (ఆంధప్రదేశ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్) ఎండీ పీఎస్ గిరిషా కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు.
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఏపీఎంఎస్ఐడీసీ (ఆంధప్రదేశ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్) ఎండీ పీఎస్ గిరిషా కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. బెంగుళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డు డైరెక్టర్‌గా కేంద్రం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు డీవోపీటీ డైరెక్టర్ ఎ.కన్మణి జోయ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన గిరిషా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు చేసుకున్న దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్‌వోసీ ఇవ్వడంతో కేంద్రం ఆయనను సెంట్రల్ సిల్క్ బోర్డు డైరెక్టర్‌గా నియమించింది.