నూతన రోడ్లను వేయించండి
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:26 PM
గ్రామంలో నూతనరోడ్లను వేయాలని నారాయణపురం గ్రామస్థులు మూకుమ్మడిగా ఎమ్మెల్యే పార్థసారథిని కోరారు.
ఆదోని రూరల్/ఆదోని, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : గ్రామంలో నూతనరోడ్లను వేయాలని నారాయణపురం గ్రామస్థులు మూకుమ్మడిగా ఎమ్మెల్యే పార్థసారథిని కోరారు. ‘ప్రజల కోసం పార్థసారథి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అడుగడుగున గ్రామ ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రోడన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయని, నూతన రోడ్లను వేయాలని, కొత్తగా పింఛన్లను మంజూరు చేయాలని, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. కాగా, గ్రామంలో ఎమ్మెల్యే పార్థసారథి గుర్రంపై పర్యటించారు. తాను అందుబాటులో ఉండి సేవలందిస్తానని ప్రజలకు భరోసానిచ్చారు.
- నారాయణపురంలో వర్షం కోసం పూజలు
మండలంలోని నారాయణపురం గ్రామంలో వర్షం కోసం గ్రామదేవత మారెమ్మవ్వ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తే ఎండు దశకు చేరిన పంటలకు జీవం పోసినట్లవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.