Genko MD Nagalakshmi: ఏడాదిలో జెన్కోకు రూ.77 కోట్లు ఆదా
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:26 AM
వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయడం ద్వారా జెన్కోలో ఒక్క ఏడాదిలో రూ.77 కోట్లు ఆదా చేయగలిగింది.
జెన్కో ఎండీ నాగలక్ష్మి
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయడం ద్వారా జెన్కోలో ఒక్క ఏడాదిలో రూ.77 కోట్లు ఆదా చేయగలిగింది. విద్యుత్తు ఉత్పత్తి, ఆర్థిక వ్యవహారాలపై సంస్థ ఎండీ నాగలక్ష్మి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంకుల నుంచి క్యాష్ క్రెడిట్(సీసీ), వర్కింగ్ క్యాపిటల్ డిమాండ్ లోన్స్(డబ్ల్యూసీడీఎల్)ను 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 9.05 శాతానికి తీసుకునేవారని, బ్యాంకు అధికారులతో సంప్రదింపుల ద్వారా 2024-25లో దానిని 8.70 శాతానికి తగ్గించడం ద్వారా ఏడాదిలోనే రూ. 60 కోట్లు ఆదా చేయగలిగామని నాగలక్ష్మి వివరించారు. అదే విధంగా చెల్లింపులు, రెన్యువల్స్‌లో ఆలస్యం కారణంగా గతంలో విధించిన రూ. 17 కోట్ల జరిమానాను కూడా బ్యాంకుల నుంచి తిరిగి పొందగలిగామన్నారు. సమీక్షలో.. జెన్కో డైరెక్టర్లు సుజయకుమార్, అశోక్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.