Share News

తిరుమలలో గీతూ రాయల్‌ రీల్స్‌

ABN , Publish Date - Mar 01 , 2026 | 06:21 AM

టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా బిగ్‌బాస్‌ ఫేం గీతూ రాయల్‌ స్నేహితులతో కలిసి సినిమా పాటకు రీల్స్‌ చేయడం విమర్శలకు దారితీసింది.

తిరుమలలో గీతూ రాయల్‌ రీల్స్‌

  • సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు..

  • చర్యలకు సిద్ధమైన టీటీడీ

తిరుమల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా బిగ్‌బాస్‌ ఫేం గీతూ రాయల్‌ స్నేహితులతో కలిసి సినిమా పాటకు రీల్స్‌ చేయడం విమర్శలకు దారితీసింది. తిరుమలలో రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకూడదని టీటీడీ పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఫాలోవర్లు, లైకుల కోసం ఇష్టానుసారం రీల్స్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా, గీతూ రాయల్‌ మరో నలుగురు యువకులతో కలిసి శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్‌కు వెళ్లే మార్గంతో పాటు ఘాట్‌రోడ్లలోనూ సినిమా పాటకు వీడియోలు చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఈ అంశంపై టీటీడీ కూడా సీరియస్‌ అయింది. నిబంధనలను అతిక్రమించిన గీతూ రాయల్‌ బృందంపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

Updated Date - Mar 01 , 2026 | 07:14 AM