గరికపాటి వ్యాఖ్యలు అభ్యంతరకరం: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Mar 23 , 2026 | 03:54 AM
మధ్యాహ్న భోజన పథకంపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు.
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకంపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు. పేద విద్యార్థుల పట్ల ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘పేద పిల్లల్లో పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజనంతోపాటు యూనిఫామ్, బూట్లు వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. టీచర్ల బోధనేతర పనులపై స్వేచ్ఛ కల్పించాల్సిందే, అయితే ఆ అంశాన్ని మిళితం చేసి పేద విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకూడదని అనడం సరికాదు’ అని పేర్కొన్నారు.